బ్రేకింగ్: అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర నిర్మించిన 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం(Ambedkar Statue)ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ హాజరయ్యారు. దేశంలోనే ఎత్తైన విగ్రహం నిర్మాణానికి 2015లో శంకుస్థాపన చేయగా.. దాదాపు ఏడేళ్ల పాటు నిర్మాణం జరిగింది. నేడు అంబేద్కర్ 125వ జయంతి కావడంతో 125అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. మొత్తం 11ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటైంది.

ఈ విగ్రహావిష్కరణకు ముందు హెలికాఫ్టర్ నుంచి అంబేద్కర్ విగ్రహంపై పూలవర్షం కురిపించారు. ఈ అంబేద్కర్(Ambedkar Statue) విగ్రహావిష్కరణతో ట్యాంక్ బండ్ చుట్టుపక్కల మరింత శోభ సంతరించుకుంది. ఇప్పటికే హుస్సేన్ సాగర్ బుద్ధుడి విగ్రహం, లుంబిని పార్క్, ఎన్టీఆర్ ఘాట్, ప్రసాద్ ఐమ్యాక్స్ పర్యాటకులను ఆకట్టుకుంటుండగా.. ఇప్పుడు ఆ జాబితాలోకి అంబేద్కర్ స్మృతివనం చేరింది.

Read Also: ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ఏర్పడింది: కేటీఆర్
Follow us on:  YoutubeKooGoogle News

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్