ఐపీఎల్(IPL)లో అదరగొడుతున్న తెలుగు కుర్రాడు, యువ సంచలనం తిలక్ వర్మ(Tilak varma)కు బంపర్ ఆఫర్ లభించింది. హైదరాబాద్ కు చెందిన తిలక్ ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్టులో అద్భుతమైన ఆట తీరుతో శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే రిలయన్స్(Reliance) అనుబంధ సంస్థ రైజ్(Rise) స్పోర్ట్స్ మేనేజ్మెంట్ తనతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై ఆ సంస్థ స్పందిస్తూ ఎంతో టాలెంట్ ఉన్న తిలక్ వర్మను తమ ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపింది. ఈ సందర్భంగా రైజ్ సంస్థలోకి అడుగుపెట్టడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని తిలక్ తెలిపాడు. రైజ్ సంస్థ ఆటగాళ్ల ఎండార్స్ మెంట్లు, ఇతర ఒప్పందాల కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఇప్పటికే ఈ కంపెనీ రోహిత్ శర్మ, పాండ్యా బ్రద్రర్స్, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్లకు సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది.
తెలుగు ఆటగాడికి రిలయన్స్ సంస్ధ బంపర్ ఆఫర్
0
319
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


