బ్రేకింగ్: కోడికత్తి కేసులో సంచలన విషయాలు

2018లో అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్ పై జరిగిన కోడి కత్తి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడ NIA కోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా NIA అధికారులు గతంలో నిందితుడు శ్రీనివాసరావు ఇచ్చిన స్టేట్మెంట్ ను న్యాయమూర్తికి సమర్పించారు. ఈ నివేదిక ప్రకారం తాను మొదటి నుంచి వైఎస్సార్ అభిమానని.. 2019లో జగన్ అధికారంలోకి రావాలని కోరుకున్నట్లు నిందితుడు తెలిపాడు.

జగన్ పై కత్తితో దాడి చేస్తే ప్రజల్లో సానుభూతి పెరిగి ఎక్కువ సీట్లు వస్తాయని భావించానని చెప్పాడు. దాడి చేస్తే ప్రమాదం జరగకుండా కోడికత్తిపై రెండు సార్లు స్టెరిలైజ్ చేయించినట్లు పేర్కొన్నాడు. విమానాశ్రయంలో టీ ఇచ్చేందుకు జగన్ దగ్గరికి వెళ్లి ఈసారి మీరు కచ్చితంగా 160సీట్లతో గెలవబోతున్నారని చెప్పగా.. ఆయన చిరునవ్వు ఇచ్చారన్నాడు.

జగన్ పై అటాక్ చేయగానే వైసీపీ నేతలు తనపై దాడి చేశారని శ్రీనివాసరావు అధికారులకు తెలిపాడు. అనంతరం తనను అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు ఈ ఘటన వెనక ఎవరున్నారో చెప్పాలని తీవ్రంగా కొట్టారన్నాడు. ఎవరు లేరని జగన్ పై అభిమానంతో తానే ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులకు చెప్పినట్లు వాంగ్మూలం ఇచ్చాడు. ఇప్పుడు ఛార్జీషీట్, కౌంటర్ తో పాటు ఇదే వాంగ్మూలాన్ని అధికారులు కోర్టులో సబ్మిట్ చేశారు.

 

Latest Articles

ప్రశ్న రావణ్ పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై సోషల్ మీడియాలో అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ప్రశ్న రావణ్ పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్