28.2 C
Hyderabad
Saturday, September 30, 2023

ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ బడ్జెట్..! -ఆర్ధికశాఖ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌: సంక్షేమం, అభివృద్ధి రెండు జొడేద్దుల్లాగా సమపాళ్లలో తెలంగాణ బడ్జెట్‌ 2023-24 ఉండబోతోందన్నారు ఆర్ధికమంత్రి హరీశ్‌రావు. అలాగే, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్‌ రూపకల్పన జరిగిందన్నారు. మరికాసేపట్లో బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు వచ్చిన ఆర్ధికమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్‌ ప్రాధాన్యాలను వివరించారు. కేంద్రం నుండి వివక్ష కొనసాగుదోందని, ఒక్క రూపాయి కూడా కేంద్రం నుండి రాకపోయినా అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ముందుకెళ్తోందన్నారు. సంక్షేమ పథకాలు ఆగకూడదన్న ఆలోచనతో బడ్జెట్ కేటాయింపులు చేశామన్నారు. తెలంగాణ మోడల్ దేశం అవలంభిస్తోందని, దేశానికి రోల్ మోడల్‌గాతెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు.

శాసనసభలో ఆర్ధికమత్రి మంత్రి హరీశ్‌రావు, శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ ప్రవేశపెడతారు. బడ్జెట్‌కు కేబినేట్ ఆమోదం తో పాటు గవర్నర్ ఆమోదం కూడా లభించింది.

బడ్జెట్‌ ప్రాధాన్యతలు ఇలా..!

రానున్న అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా సర్కార్ ప్లాన్
హ్యాట్రిక్ సాధించేందుకు అనువైన, ప్రజా ఆమోదయోగ్యమైన బడ్జెట్
సంక్షేమ పథకాలు, అభివృద్ది అంశాలకు పెద్దపీట
గత ఏడాది 2,56,958.51 కోట్ల బడ్జెట్
ఈ వార్షిక సంవత్సరానికి సుమారు 2.90 లక్షల కోట్ల పైగా బడ్జెట్
దళితులకు, బీసీలకు, ఇళ్లు నిర్మించుకునే వారికి పెద్ద పీట వేయబోతున్న ప్రభుత్వం

2023-24 బడ్జెట్‌ ముఖ్య కేటాయింపులు ఇలా ఉండే అవకాశం

వేతనాలు, ప్రభుత్వ ఖర్చుకు రూ. 40వేల కోట్లు
ఆర్ధికశాఖకు రూ. 40వేల కోట్లు
ఇరిగేషన్‌ శాఖకు రూ. 37వేల కోట్లు
వ్యవసాయానికి రూ. 35వేల కోట్లు
రోడ్లు భవనాలు శాఖకు రూ. 25వేల కోట్లు
పంచాయతీరాజ్‌ రూ. 25వేల కోట్లు
దళితబంధు పథకానికి రూ. 18వేలకోట్లు
సొంతింటి పథకం రూ. 18వేల కోట్లు

Latest Articles

వ్యక్తి కడుపులో ఇయర్‌‌ ఫోన్లు, తాళం, బోల్టులు.. షాక్‌ అయిన వైద్యులు

స్వతంత్ర వెబ్ డెస్క్: పిల్లలు ఆడుకుంటూ.. అనుకోకుండా చిన్న చిన్న వస్తువులు మింగడం చూశాం. ఇంకొందరు విన్యాసాలు చేసేందుకు కొన్ని వస్తువులు మింగి మళ్లీ తీయడం చూస్తుంటాం.. మరి కొంత మంది కాయిన్స్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్