తెలంగాణలో సమగ్ర కులగణన చేయడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఉదయం లోటస్‌ఫాండ్‌లోని మంత్రి నివాసంలో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి ఆధ్వర్యంలో మంత్రి నుంచి వివరాలను సేకరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబ వివరాలను నమోదు చేశారు ఎన్యుమరేటర్లు, అధికారులు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.