భట్టి విక్రమార్క సీఎం కావాలని కోరుకుంటున్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా రూల్స్‌పై సాగిన చర్చలో..భట్టి విక్రమార్కని ఉద్దేశిస్తూ హరీశ్‌రావు వ్యాఖ్యలు చేశారు. భట్టి విక్రమార్కను రెండు సార్లు డిప్యూటీ స్పీకర్ అని సంబోధించారు హరీశ్‌రావు. భట్టి డిప్యూటీ స్పీకర్ కాదని.. డిప్యూటీ సీఎం అని గుర్తు చేశారు స్పీకర్. విక్రమార్క గతంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారని హరీశ్‌రావు గుర్తు చేశారు. అనంతరం మళ్లీ అలాగే సంబోధించారు హరీశ్‌రావు.