టీడీపీ నేతల సస్పెన్షన్‌.. స్పీకర్‌ తమ్మినేని కీలక వ్యాఖ్యలు

స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. సభ్యులు శాసనసభ నియమావళి సాంప్రదాయాలు పాటించాలి. సభ్యులపై సస్పెన్షన్ ఒక్కటే కాదు.. అనుచిత ప్రవర్తన మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవచ్చు అని హెచ్చరించారు. ప్రతీ సభ్యులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు.

కాగా, స్పీకర్‌ తమ్మినేని శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్ర రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్నాయి. శాసనసభ్యులు సభా సంప్రదాయాలను ఉల్లఘించి సమాజానికి ఏమని సంకేతాలు ఇస్తున్నారు. స్పీకర్‌ పోడియంపైకి రావడం.. గేలి చేయడం ప్రజలు గమనిస్తున్నారు. టీడీపీ సభ్యుల చేష్టలపై మాట్లాడాలంటే నాకు చాలా బాధగా ఉంది. నేను శాసనసభలో ఉన్నాను అని, బాధ్యతగా వ్యవహరించాలనే స్పృహ సభ్యులకు ఉండాలి. సభ్యులపై సస్పెన్షన్ ఒక్కటే కాదు.. అనుచిత ప్రవర్తన మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవచ్చు.

 

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఈ విషయంలో సభలో చర్చించేందుకు సమయం ఇచ్చాం. కానీ, టీడీపీ సభ్యులు ఆ సమయాన్ని ఉపయోగించుకోలేదు. ప్లకార్డులు ప్రదర్శించడం, విజిల్స్  వేయడం, సభలో ఉన్న వస్తువులను ధ్వంసం చేయడం మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం అన్యాయం చేస్తుందనే భావన ఉంటే.. శాసనసభలో ఉండి పోరాడాలి. చంద్రబాబును, టీడీపీ సభ్యులను సభ నుంచి ఎవరూ పొమ్మనలేదు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే ఆయనపై కేసు నమోదు అయ్యింది. స్కిల్‌ స్కాంపై సరైన ఆధారాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబు అరెస్ట్‌ అయ్యారు. రాష్ట్రంలో పొత్తులు అనేవి రాజకీయ పార్టీలకు సంబంధించినవి’ అని కామెంట్స్‌ చేశారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్