నగరంలోని ప్రీమియర్ సోలార్ ఎక్స్‌పో, అవార్డుల వేడుక మరియు సదస్సు, సూర్యకాన్ హైదరాబాద్ 2024, మైండ్‌స్పేస్‌లోని హోటల్ ది వెస్టిన్‌లో జరిగింది. సౌర శక్తి రంగంలో అత్యంత పురాతన మీడియా నెట్‌వర్క్ అయిన ఈక్యు మ్యాగజైన్ నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం డీకార్బనైజేషన్, కార్బన్ న్యూట్రాలిటీ మరియు పర్యావరణ స్థిరత్వంలో పురోగతిని ప్రదర్శించింది. ఈ సమావేశంలో మాజీ ఎంపీ, ఇండియన్ సోలార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ సి.నరసింహన్ సహా ఆదాయపు పన్ను అదనపు కమిషనర్, హైదరాబాద్, శ్రీ ఎస్.బి. యాదగిరి, IRS తదితరులు హాజరయ్యారు. సోలార్ ఎనర్జీ డెవలప్‌మెంట్ మరియు ఈ రంగానికి మద్దతుగా రూపొందించిన ప్రభుత్వ కార్యక్రమాలపై కీలక చర్చలు నిర్వహించారు.
సౌర విద్యుత్ పరిశ్రమలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులను సైతం ఈ కార్యక్రమంలో అందజేశారు. భారతీయ సోలార్ మాడ్యూల్ తయారీలో అగ్రగామిగా సోవా సోలార్ ప్రశంసలు పొందగా , అగ్రశ్రేణి ఇన్వర్టర్ బ్రాండ్ గా సోలిస్ అవార్డును అందుకుంది. ఇతర విజేతలలో సోలార్ మాడ్యూల్ కంపెనీగా యుటిలిటీ స్కేల్ (డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్) విభాగంలో ECE (ఇండియా) ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్నోవేటివ్ సర్వీస్ సొల్యూషన్స్ లీడర్ గా, SMA సోలార్ తదితర సంస్థలు అవార్డులు అందుకున్నాయి. పునరుత్పాదక ఇంధన రంగానికి అందించిన సేవలకు గానూ లీడర్‌షిప్ ఎక్సలెన్స్ అవార్డును శ్రీ సి. నరసింహన్ అందుకున్నారు.
ఈ సందర్భంగా, శ్రీ నరసింహన్ మాట్లాడుతూ.. 2030 నాటికి 500 గిగావాట్ల సౌర విద్యుత్ ని సాధించాలనే ప్రధాన మంత్రి ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నొక్కి చెప్పారు. పునరుత్పాదక ఇంధనాన్ని స్వీకరించడానికి రెండు తెలుగు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని కొత్త సౌరశక్తి విధానాలను ఆయన ప్రవేశపెట్టారు. సౌరశక్తి యొక్క ఆర్థిక ప్రయోజనాలను గురించి శ్రీ ఎస్.బి.యాదగిరి వెల్లడించారు.