స్వతంత్ర వెబ్ డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అవినాశ్‌తో పాటు సీబీఐకి కూడా ధర్మాసనం నోటీసులు పంపించింది. వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు అవినాశ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు సుప్రీంలో సునీత పిటిషన్‌పై విచారణ జరిగింది. సునీత తరపున సీనియర్ కౌన్సిల్ సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ క్రమంలో అవినాశ్ రెడ్డితో పాటు సీబీఐకి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది. జులై 3న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు కేసును విచారించాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు
0
552
Next article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


