35.2 C
Hyderabad
Saturday, May 9, 2026
spot_img

పార్టీ ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. BRS మ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ జార్జి మైస్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు నాలుగు నెలల్లో ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని గతేడాది మార్చిలో చెప్పినా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని కౌశిక్‌రెడ్డి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తగిన సమయంలో స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడం లేదని తెలిపారు.

ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చామని అసెంబ్లీ కార్యదర్శి తరఫు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ కోర్టుకు తెలిపారు. నిర్ణయం తీసుకునేందుకు ఎమ్మెల్యేలకు స్పీకర్‌ తగిన సమయం ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన గుర్తుచేశారు. ఎంత సమయం కావాలో స్పీకర్‌ను కనుక్కుని చెప్పాలని ముకుల్‌ రోహత్గీకి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ధర్మాసనం సూచించింది. అనంతరం తదుపరి విచారణను సుప్రీంకోర్టు వారం రోజులు వాయిదా వేసింది.

Latest Articles

రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ… మోదీతో రేవంత్ ప్రత్యేక భేటీ

హైదరాబాద్ అభివృద్ధి ప్రాజెక్టులపై కీలక పరిణామాలకు రంగం సిద్ధమైంది. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi) హైదరాబాద్‌కు రానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక వినతులు సమర్పించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్