ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను పదవి నుంచి తొలగించాలని దాఖలైన అపీలును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇలాంటి పిటిషన్ల విషయంలో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయినందువల్ల ముఖ్యమంత్రి పదవి నుంచి కేజ్రీవాల్ ను తొలగించాలని కోరుతూ ఈ అపీలు దాఖలైంది. ఈ విషయంలో స్పందించ వలసింది ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. అనీ కోర్టు జోక్యం చేసుకోబోదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపంకర్ దత్తాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇది ఔచిత్యానికి సంబంధించిన అంశమని, అయితే అరెస్టు కారణంగా కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోరే చట్టపరమైన హక్కు లేదని కోర్టు పేర్కొంది.ఏప్రిల్ 10న ఢిల్లీ హైకోర్టు తన పిటిషన్ ను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్ కాంత్ భాటి చేసిన అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం విచారించింది.
కేజ్రీవాల్ పై అపీలు కొట్టివేసిన సుప్రీంకోర్టు
0
301
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


