ఏపీలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. తిరుపతి జిల్లా శ్రీహరి కోట సమీప ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ఉత్తర కోన శ్రీహరికోట, కర్ణాటక, తమిళనాడులోని ధర్మపురి, రత్నగిరి, శివమొగ్గ, హాసన్‌ తదితర ప్రాంతాలపై ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి పవనాలు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాగల 24గంటల్లో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో జల్లులు పడే అవకాశాముందని ఐఎండీ వెల్లడించింది.

తెలంగాణలో రాగల 3రోజులకు వాతావరణ సమాచారాన్ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు ఆదివారం కర్ణాటక, పుదుచ్చేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని మరి కొన్ని ప్రాంతాలకు విస్తరిచాయి. దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయి.

ఈరోజు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశముందని పేర్కొన్నారు. ఇవాళ ఖమ్మం, కొత్తగూడెం, ఆదిలాబాద్‌, కుమురంభీమ్‌, మంచిర్యాల, నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో , సోమవారం ఆదిలాబాద్‌, కుమురంభీమ్‌, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని వాతావర కేంద్రం సంచాలకులు వెల్లడించారు.

Latest Articles

2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు

2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు కొనసాగింది. నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.6.51 లక్షల కోట్లు కాగా... ఇది గతేడాదితో పోలిస్తే 16.4 శాతం వృద్ధి రేటు నమోదైంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్