డబ్బు.. మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది. తన,మన, పరాయి ఇలాంటి భేదాలేమీ లేవు. తల్లి, చెల్లి, తమ్ముడు, బిడ్డ ఇలాంటి అనుబంధాలు అసలే కనిపించవు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. విలాసాలు, చెడు అలవాట్లకు బానిసలై తల్లిదండ్రులు, రక్త సంబంధాలను చూడకుండా హత్య చేయడానికి తెగబడుతున్నారు.
తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. ఆస్తి కోసం కన్న కొడుకు.. కన్న తల్లిని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని డివినోస్ విల్లాస్‌లో నివసించే కార్తీక్ రెడ్డి (26) తాగుడుకు బానిసయ్యాడు. ఆస్తి కోసం తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారు జామున తల్లి రాధిక (52) పై కార్తీక్ కత్తితో దాడి చేశాడు. రక్తపు మడుగులతో ఉన్న రాధికను కుటుంబ సభ్యులు హుటాహుటిన నల్లగండ్లలోని సిటిజన్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాధిక మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న కొల్లూరు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పటాన్‌చెరు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.