అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం నుంచి కుంభమేళాకు ఆర్టీసి బస్సులు బయలుదేరి వెళ్లాయి. అమలాపురం డిపో నుంచి ఆరు కొత్త బస్సులు 210 మంది ప్రయాణీకులు, సిబ్బందితో వెళ్లాయి. బస్సులను జిల్లా రవాణాశాఖ కమిషనర్ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. కుంభమేళా భక్తులకు ఎనిమిది రోజుల పాటు వివిధ పుణ్యక్షేత్రాల్లో దైవ దర్శనంతో పాటు భోజన వసతి కూడా కల్పిస్తోంది ఆర్టీసీ. ఈ బస్సుల్లో హైదరాబాద్, విజయవాడ నుంచి కూడా భక్తులు యాత్రకు వెళ్తున్నారు. ప్రతి బస్సుకు ఇద్దరు డ్రైవర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్ ఉన్నారు. భోజనాలు, అల్పాహారం కోసం వంట మనిషి, సాయంగా మరొకరిని బస్సులో పంపారు. హైదరాబాద్ నుంచి అమలాపురం వచ్చి కుంభమేళాకు వెళ్లడం ఆనందంగా ఉందని భక్తులు అన్నారు.
అమలాపురం నుంచి కుంభమేళాలకు ఆరు ఆర్టీసీ బస్సులు
0
310
Previous article
Next article
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


