CM JAGAN | అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ పురస్కరించుకుని ముస్లిం సోదరసోదరీమణులకు సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లా దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఈ మేరకు ఒక ప్రకటనలో తన సందేశాన్ని వివరిస్తూ.. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సఫలం కావాలని కోరారు. మనిషిలోని చెడు భావనల్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని సీఎం పేర్కొన్నారు. కఠోర ఉపవాస దీక్షలతో క్రమశిక్షణ, దానధర్మాలతో దాతృత్వం, సామూహిక ప్రార్థనలతో ధార్మిక చింతన, ఐకమత్యం… ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని తెలిపారు. ఈ మాసంలో పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిందని తెలిపారు. కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని పేర్కొన్నారు.
చెడు భావనల్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్: సీఎం జగన్
0
272
Previous article
Latest Articles
నాని లైనప్ మారిందా..?
నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -
- Advertisement -


