విజయ్‌పై నాకు అసూయ లేదు.. కమల్‌హాసన్‌పై ఉండేదేమో- రజనీకాంత్‌

తమిళనాడులో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై సూపర్‌స్టార్ రజనీకాంత్ తొలిసారి స్పందించారు. తాను రాజకీయాల్లో లేనని స్పష్టం చేశారు. విజయ్ ముఖ్యమంత్రి కావడంపై అసూయ పడాల్సిన అవసరం తనకు లేదన్నారు.
“విజయ్ సీఎం కావడంపై నేను ఎందుకు అసూయపడతాను? కమల్ హాసన్ ముఖ్యమంత్రి అయితే అసూయ పడేవాడినేమో” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అలాగే విజయ్ తన సమకాలికుడు కాదని, తమ ఇద్దరి మధ్య దాదాపు 25 ఏళ్ల వయస్సు తేడా ఉందని తెలిపారు.
తమిళనాడు ప్రజలు మార్పును కోరుకున్నారని, అందుకే విజయ్‌ను గెలిపించారని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం ఎంకే స్టాలిన్‌ను కలవడంపై వస్తున్న ప్రచారాలను  కూడా ఆయన ఖండించారు.
“స్టాలిన్ నాకు చాలా కాలంగా మంచి స్నేహితుడు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. నేను కేవలం స్నేహపూర్వకంగా కలిసాను. దాన్ని రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదు” అని రజనీకాంత్ అన్నారు.
ఇక విజయ్‌ను సీఎం కాకుండా అడ్డుకునేందుకు తాను ప్రయత్నించానంటూ వస్తున్న ఆరోపణలను రజనీకాంత్ తీవ్రంగా ఖండించారు. “అలాంటి నీచ రాజకీయాలు నేను చేయను. నా వ్యక్తిత్వం అందరికీ తెలుసు” అంటూ స్పష్టం చేశారు రజనీకాంత్‌.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్