నారా దేవాంశ్ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభం

మంత్రి నారా లోకేశ్( Nara Lokesh) తనయుడు దేవాశ్ నారా(Devansh Nara) డీనో డీట్స్( ‘Dino Deets’ ) పేరుతో కొత్త యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా, నందమూరి కుటుంబ సభ్యులు దేవాంశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న లోకేశ్‌.. యూట్యూబ్‌, పాడ్‌కాస్ట్‌ల ప్రత్యేకతలను తెలుసుకున్నారు.

డైనోసార్లు, శిలాజాలు, పురాతన అవశేషాల గురించి తాను తెలుసుకున్న ఆసక్తికరమైన విషయాలను సరదాగా, ఆలోచింపజేసేలా దేవాంశ్‌ ఈ ఛానల్‌ ద్వారా ప్రేక్షకులతో పంచుకోనున్నారు. “దేవాంశ్‌ సృష్టించిన ప్రాచీన ప్రపంచంలోకి ఓ ప్రేక్షకుడిలా ప్రవేశించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అంటూ లోకేశ్‌ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు.

ఇప్పటికే చదరంగంలో తన ప్రతిభను చాటుకున్న దేవాంశ్‌, క్లిష్టమైన 175 చెస్‌ ఫజిల్స్‌ను వేగంగా పరిష్కరించి ‘Fastest Checkmate Solver’గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. ‘5334 Problems and Games’ పుస్తకంలోని 175 సంక్లిష్ట చెక్‌మేట్‌ ఫజిల్స్‌ను గత ఏడాది రికార్డు సమయంలో పూర్తి చేసి ఈ ఘనత సాధించారు.

 

Latest Articles

నాతన ధర్మం ట్రెండ్.. మారిందా..?

ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామాలు, హర్రర్ కామెడీలు.. ఈ మధ్య పాన్ ఇండియా యాక్షన్ సినిమాల ట్రెండు నడుస్తుంది. అలాగే హిందూ పురాణాల కథలతో సనాతన ధర్మం అంటూ ఓ కొత్త ట్రెండ్ కూడా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్