తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే నైరుతి రుతపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం పడే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30-40 కి.మీ వేగంగా భారీగా ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. అదే విధంగా పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలు చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో నైరుతి రుతుపవనాలు ఏపీ వ్యాప్తంగా విస్తరిం చాయి. వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావ రణ కేంద్రం పేర్కొంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, మరో రెండు కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్జ్
0
322
Previous article
Next article
Latest Articles
నాని లైనప్ మారిందా..?
నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -
- Advertisement -


