ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని అంటే తనకు ఎలాంటి ద్వేషం లేదన్నారు. మోదీ చేసే పనులను, తీసుకునే నిర్ణయాలను తాను అర్థం చేసుకోగలనన్నారు. ఆయన అభిప్రాయాలు వేరని.. వాటితో తాను ఏకీభవించలేనని తెలిపారు. అంతేకానీ తాను ఆయనను ద్వేషించలేదనీ.. శత్రువుగా చూడట్లేదని చెప్పారు. ప్రధాని చేసే పనులను అర్థం చేసుకున్నప్పటికీ.. అవి మంచి ఫలితాలు ఇస్తాయని తాను అనుకోవట్లేదన్నారు. తమ ఇద్దరివీ విభిన్న దృక్పథాలని రాహుల్ వ్యాఖ్యానించారు.