బీసీ కులగణన మీద తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ మాజీ పీ సీ సీ చీఫ్ హనుమంత్ రావు అన్నారు. కులగణన జరిగినప్పుడే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని వీహెచ్ తెలిపారు. బీసీ కులగణనకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ లో తీర్మానం చేసి బీ సీ కమీషన్ ఏర్పాటు చేసామని దేశ వ్యాప్తంగా అన్ని కులాల గుణన కోసం ఢిల్లి వేదికగా పొరడుతామన్నారు వీ హెచ్.