లావణ్య, రాజ్‌తరుణ్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. బంగారం, పుస్తెలతాడు దొంగలించాడని రాజ్‌తరుణ్‌పై లావణ్య ఫిర్యాదు చేసింది. జ్యువెలరీ షాప్ బిల్స్‌తో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా తన ఇంట్లో దొంగతనం చేశారని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో లావణ్య ఫిర్యాదు చేసింది. సుమారు 12 లక్షల విలువైన బంగారాన్ని రాజ్ తరుణ్, మల్విలు కలిసి దొంగలించారని లావణ్య ఆరోపిస్తోంది. నగలు దాచిన బీరువా తాళం రాజ్‌తరుణ్ దగ్గరే ఉందని లావణ్య చెబుతోంది. తాను సినిమా ఫీల్డ్‌కు చెందిన మహిళనని.. ఇకనుండి నేరుగా మా అసోసియేషన్‌కు వెళ్లి న్యాయం చేయాలని యూనియన్ సభ్యులను కోరతానని లావణ్య తెలిపింది.