కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. కర్నాటక కాంగ్రెస్ పార్టీకి చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.ధృవ నారాయణ (61) గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఫిబ్రవరి 4వ తేదీన ధృవ నారాయణకు ఛాతినొప్పి రావడంతో ఆయన డ్రైవర్ మైసూరులోని డిఆర్‌ఎంఎస్ ఆసుపత్రిలో చేర్చారు. ఆరోజు నుంచి నేటి వరకు చికిత్స పొందుతూ.. ఇవాళ ఇంకాస్త ఆరోగ్యం విషమించి మృతి చెందినట్టు డిఆర్‌ఎంఎస్ వైద్యులు వెల్లడించారు. కాగా, నారాయణ కాంగ్రెస్ తరుఫున 2సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా బాధ్యతలు నిర్వహించి ప్రజాధారణ పొందారు.