రోడ్డు ప్రమాదాలపై పోలీస్ యంత్రాంగం ఫోకస్

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ఫోకస్‌ పెట్టింది పోలీస్‌ యంత్రాంగం. ఈ మేరకు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ట్రాఫిక్‌ను నియంత్రించే క్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల సేవలను వినియోగించుకు నేందుకు వారికి శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టింది. సుమారు 30 వేల మంది నేషనల్‌ సర్వీస్‌ స్కీమ్‌ వాలంటీర్లకు శిక్షణనిచ్చి వారి సేవలను ట్రాఫిక్‌ నియంత్రణకు వినియోగించుకో నున్నారు. వీరు వాహనదారులకు, ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిన అవశ్యకత , వాటి వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించకపోతే కలిగే అనర్థాలు వంటి అంశాలను వివరించనున్నారు. దీని కోసం విద్యా, పోలీస్‌శాఖ సంయుక్తంగా కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి సంయుక్తంగా ఎన్ఎస్ఎస్‌లో రిజిస్టర్ అయిన యువతి, యువకుల సేవలను వినియోగించనున్నారు.

 ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసులు 500 మంది విద్యార్ధులకు ట్రాఫిక్ అంశాలపై శిక్షణను ఇచ్చారు. ఇలా శిక్షణను పొందిన విద్యార్ధులు నెలకు ఒక గంట పాటు పోలీసు లు కేటాయించే స్పాట్‌లలో నిలబడి ట్రాఫిక్ అంశాలపై వాహనదారులకు, ప్రజలకు అవగాహనను కల్పించనున్నారు. మొదటి ఫేజ్‌లో భాగంగా 30 వేల ఎన్ఎస్ఎస్ విద్యార్ధుల సేవలను పోలీసులు వినియోగించుకోనున్నారు. బషీర్‌బాగ్‌ లో జరిగిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ రవిగుప్తా విద్యార్థులకు డ్రెస్ కోడ్ దుస్తులను అందించారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా మార్చేందుకు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలను తప్పక ఉపయోగించుకుంటామన్నారు రవిగుప్తా. వీరి ద్వారా ప్రతి స్కూల్, పాఠశాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్