తెలంగాణలో వాతావరణం కాస్త చల్లగానే ఉన్నా వర్షాలు మాత్రం అన్ని ప్రాంతాల్లో కురవడం లేదు. తాజాగా రాష్ట్రంలో వర్షాలు కురవడంపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రం లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే హైదరాబాద్ వాతావరణ కేంద్రం రైతన్నలకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది. రైతన్నలూ ఇక వ్యవ సాయానికి సిద్ధం కండి.రాబోయే నాలుగు రోజులు వర్షాలు కురవను న్నాయని తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. నైరుతీ రుతుపవనాల సీజన్‌లో జూన్ నెలాఖరులో కురిసే వర్షాలే రాష్ట్రంలో నీటి వనరులకు పంటల సాగుకు ముఖ్యమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
నైరుతీ రుతుపవనాల కదలికలు సంతృప్తికరంగా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో రేపటి నుంచి రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలుక ఉరిసే అవకాశం ఉందని చెప్పారు. రాష్ర్టానికి నైరుతీ దిశగా గాలులు వీస్తున్నాయని వర్షాలను అనుకూల పరిస్థితి ఉందని చెప్పారు. రేపటి వరుసగా మూడు రోజుల పాటు ఉత్తర, తూర్పు ప్రాంత జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడిం చారు. నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు ఉండడంతో ఆయా జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. నైరుతీ సీజన్‌కు సంబంధించి ఏటా జూన్ 24 తేదీ నాటికి రాష్ట్రంలో 9.94 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాలి.కానీ ఈ సారి 12.17 సెంటీమీటర్లు కురిసింది. సాధా రణం కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. వానలు ఊపందుకోనున్న నేపథ్యంలో నెలాఖరు నాటికి ఆయా జిల్లాల్లో వర్షపాతం లోటు భర్తీ అవుతుందని భావిస్తున్నారు. వానల కోసం ఆశగా ఎదురు చూస్తున్న రైతులు.. సాగుపనులకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఆరు జిల్లాల్లో మాత్రమే సమృద్ధిగా వర్షాలు కురిశాయి. హైదరాబాద్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, నారాయణ పేట్ జిల్లాల్లో సాధారణం కంటే 60శాతం అధికంగా వర్షాలు కురిశాయి. రానున్న రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు చెట్లు, స్తంభాలు, టవర్లు, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని హెచ్చరించారు.