కెనడాలోని టొరంటోలో బోల్తా పడిన విమానం
అమెరికా నుంచి వస్తున్న విమానం
మంచుతో నిండిపోయిన రన్‌వే
సరిగా ల్యాండ్ అయినా.. రన్‌వేపై మంచుతో బోల్తా
విమానాశ్రయంలో రన్‌వేపై విమానం బోల్తాపడింది. ఇది వినడానికి ఆశ్యర్యంగా ఉన్నా.. ఇది నిజం. రన్‌వేపై మంచు కప్పేయడంతో విమానం బోల్తా పడినట్టు తెలుస్తోంది.
కెనడాలోని టొరంటోలో ఈ ఘటన జరిగింది. డెల్టా సంస్థకు చెందిన విమానం అమెరికా నుంచి వచ్చింది. అప్పటికే రన్‌వేపై మంచు దుప్పటి కప్పేసింది. అయినా కూడా విమానం ల్యాండింగ్‌లో ఎలాంటి సమస్యా ఎదురుకాలేదు. ఈ విమానం సరిగ్గానే ల్యాండ్ అయినా.. రన్ వే అంతా మంచుతో నిండిపోవడంతో బోల్తా పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. అయితే అదృష్టవశాత్తూ పెద్దగా గాయాలు కాకపోవడంతో అందరూ ఊపరిపీల్చుకున్నారు.