ఎన్నికల్లో పొత్తులపై పవన్​ క్లారిటీ.! -కొత్త పొత్తులు వస్తే.. కలిసి ముందుకు వెళ్తామని వెల్లడి

  • బీజేపీతో ఇప్పటికే పొత్తులో ఉన్నామన్న పవన్‌కల్యాణ్‌

రాబోయే ఎన్నికల్లో పొత్తులపై జనసేనాని పవన్‌కల్యాణ్‌​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓట్లు చీలకూడదు.. అన్నదే తన అభిప్రాయమని పేర్కొన్నారు. బీజేపీతో ఇప్పటికే పొత్తులో ఉన్నామన్న పవన్.. ఆ పార్టీ కాదంటే, ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని తెలిపారు. కొత్త పొత్తులు వస్తే, ఆ పార్టీలతోనూ కలిసి ముందుకు వెళ్తామన్న ఆయన.. ఎన్నికల ముందు పొత్తులపై మరింత స్పష్టత వస్తుందని చెప్పారు. అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు పవన్‌కల్యాణ్‌.

ఆంధ్రప్రదేశ్​లో వైఎస్​ఆర్​సీపీ ప్రభుత్వానికి 175 సీట్లు వస్తాయన్న నమ్మకం ఉంటే.. విపక్షలను ఈ విధంగా ఎందుకు ఇబ్బందుల పాలు చేస్తున్నారని పవన్​ కల్యాణ్​ ప్రశ్నించారు. జగన్​ ప్రభుత్వానికి రోజురోజుకూ విశ్వాసం సన్నగిల్లుతోందని జనసేనాని విమర్శించారు. లోకేశ్‌ పర్యటన, తన పర్యటనను అడ్డుకుంటే.. వారిపై వారికి నమ్మకం లేనట్లేనని పవన్ చెప్పారు.

Latest Articles

రికార్డులు తిరగరాయడం టీడీపీకే సాధ్యం- చంద్రబాబు

వర్చువల్‌ మహానాడు చరిత్ర సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కార్యకర్తే అధినేత అనేది మహానాడు సందేశమని చెప్పారు. తెలుగు ప్రజల గుండెచప్పుడు ఎన్టీఆర్‌ అని.. NTRకు భారతరత్న ఇవ్వాలని మహానాడులో తీర్మానం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్