- బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో.. చోటు దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ సాంగ్
తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. తొలిసారిగా ఓ తెలుగు పాట.. ఆస్కార్ అవార్డుల బరిలో అడుగు పెట్టింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాటకు ఆస్కార్ నామినేషన్ ఖరారైంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆస్కార్ అవార్డుల తుది నామినేషన్ల ప్రకటన కార్యక్రమం జరిగింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట చోటు దక్కించుకుంది.

ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు కీరవాణి బాణీలు అందించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను ఆలపించారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ సమకూర్చిన నృత్యరీతులు అందరిని అలరించాయి.