పవన్ దూకుడుతో వైసీపీ నేతల్లో కలవరం మొదలైందా? కాకినాడ పోర్టులో పవన్ చేసిన హడావిడి అంతాఇంతా కాదు. బియ్యం అక్రమ రవాణాను సీరియస్‌గా తీసుకున్న కూటమి సర్కారు కొరడా జులిపించేందుకు సిద్ధమైంది. ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది? కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ… ఎవర్నీ ఉపేక్షించేదే లేదని వార్నింగ్ ఇవ్వడంతో ఆ మాజీ ఎమ్మెల్యే వెన్నులో వణుకు మొదలైందట. ఇంతకూ… ఎవరా మాజీ ఎమ్మెల్యే? పవన్ ఆ ప్రతిపక్ష నేతను నిజంగానే టార్గెట్ చేశారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ
కాకినాడ నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని కూటమి నేతలు గట్టిగా వాదిస్తున్నారు. దాని వెనక ఉన్న రాజకీయనేతలు ఎవరో కూడా తెలుసని, ఎవ్వరినీ వదిలేది లేదని అంటున్నారు. కాకినాడలోని యాంకరేజ్ పోర్టు నుంచి భారీగా రేషన్ బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారుల మీద ఫైరయ్యారు పవన్ కల్యాణ్. ప్రజాప్రతినిధులు, నేతలు వచ్చి అక్రమ రవాణాను ఆపితే కానీ.. చర్యలు తీసుకోరా అని నిలదీశారు. పశ్చిమ ఆఫ్రికా దేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్జ్‌లో బియ్యాన్ని పరిశీలించారు. కాకినాడ పోర్టు నుంచి ఈ స్థాయిలో బియ్యం అక్రమంగా తరలిపోతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై ఈ సీరియస్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యేకు సహకరిస్తున్నారన్న అనుమానంతో ఇప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యేను కూడా మందలించారు పవన్. అక్రమ రేషన్ బియ్యం దందా వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టొద్దని అధికారులను ఆదేశించారు.
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రంపూడి చంద్రశేఖరరెడ్డి.. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే అయిన వైసీపీ నాయకుడు.. ఒకప్పుడు కాకినాడ. ఆయన అడ్డా. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ అతని హవా నడిచింది. అధికారంతో పాటు వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారారు. మొదటి నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి తీరుపై పవన్‌కల్యాణ్ ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో పవన్.. ద్వారంపూడిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఆయన చేస్తున్న ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తున్నారని.. ఆయన ఆటలు సాగనివ్వమంటూ హెచ్చరించారు. ద్వారంపూడి అధ:పాతాళానికి తొక్కేస్తానని.. లేకుంటే పేరు మార్చుకుంటానంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలకు ముందే రేషన్ బియ్యం దందా అంతు తేలుస్తామని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు అన్నంత పనిచేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కనుసన్నునల్లోనే బియ్యం స్మగ్లింగ్ జరుగుతుందని వినికిడి. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆయన చేసిన బియ్యం దందా..ఆఫ్రికా దేశాలన్నింటికీ పాకిందని టాక్. రేషన్ బియ్యాన్ని కేజీ పది రూపాయలకు కొని..వాటిని స్మగ్లింగ్ చేయడమే పనిగా పెట్టుకున్నారట. వేల కోట్ల విలువైన బియ్యాన్ని తరలించి ఉంటారన్న చర్చ ఉంది. కాకినాడ పోర్టును తన గుప్పిట్లో పెట్టుకుని ద్వారంపూడి దందా నడిపిస్తున్నారని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి.
కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాదెండ్ల మనోహర్ కాకినాడ బియ్యం మాఫియాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కొన్ని రోజుల పాటు కాకినాడలోనే మకాం వేసి పలు గోదాముల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్నీ సీజ్ చేశారు. అంతలోపే కాకినాడ పోర్టుకు దగ్గరలో రేషన్ బియ్యం పట్టుబడటంతో పవనే రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. ఇక నుంచి ఉక్కుపాదమే అంటున్నారు పవన్. ఎవరినీ విడిచిపెట్టేది లేదని..అధికారులు నిఘా పెట్టాల్సిందేనని ఆర్డర్స్ ఇచ్చేశారు. దీంతో… ద్వారంపూడికి దారులన్నీ మూసుసుకుపోయినట్లే అనే ప్రచారం జరుగుతోంది.
తాజాగా వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మె ల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన రొయ్యల ఫ్యాక్టరీని అధికారులు సీజ్ చేశారు. ఆ ఫ్యాక్టరీ కాలుష్య నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించారు. దీంతో ఫ్యాక్టరీని సీజ్ చేశారు. జగన్‌కు అత్యంత సన్నిహితుడైన ద్వారంపూడికి కాకినాడ జిల్లాలో రెండు చోట్ల వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్ పేరుతో రొయ్యల కంపెనీలున్నాయి. వీటిలో ఒకటి కాకినాడ సమీపంలోని కరప మండలం గురజనాపల్లిలో ఉంది. దీనిలో భారీగా కాలుష్య నిబంధనలను ఉల్లంఘించారని తేలడంతో ఇటీవల దానిని పీసీబీ సీజ్ చేసింది. ప్రత్తిపాడు మండలం లంపకలోవలోని మరో కంపెనీలోనూ ఉల్లంఘనలను గుర్తించారు. కంపెనీ విడుదల చేస్తున్న ఏడు రకాల వ్యర్థజలాలను పరిశీలించగా.. పీసీబీ ప్రమాణాలకు లోబడి శుద్ధి చేయడం లేదని తేలింది. దీంతో కంపెనీని సీజ్ చేశారు. పవన్ కల్యాణ్ ఫోకస్ చేయడం వల్లే ద్వారంపూడి కంపెనీలపై చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. మొత్తంగా పవన్ ఎంట్రీతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెక్‌పడ్డట్లే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మున్ముందు ద్వారంపూడి మరిన్ని చిక్కుల్లో ఇరుక్కోక తప్పదనే వాదన వినినపిస్తోంది. మరి ఈ కథ ఎటు తిరుగుతుందో చూడాలి.