పిఠాపురం బరిలో పవన్ పోటీ

    చాలాకాలం సస్పెన్స్ తర్వాత, ఎన్నో రోజుల ఎదురు చూపులకు తెరదించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తాను పోటీ చేయబోయే స్థానం ఏదో ఎట్టకేలేకు చెప్పేశారు. ఎన్నో ఊహాగానాలకు చెక్ పెడుతూ  ఫైనల్‌గా పిఠాపురం బరిని ఎంచుకున్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈసారి తాను పిఠాపురం బరిలో దిగునున్నట్లు స్వయంగా ప్రకటించారు.

       జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతారనే సస్పెన్స్‌కు తెరపడింది. పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్టు జనసేనాని పవన్ స్వయంగా ప్రకటిం చారు. ప్రస్తుతం ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందంటూ పవన్ క్లారిటీ ఇచ్చారు. 2014లో పార్టీ స్థాపించగానే పిఠాపురం నుంచి చేయమని తనకు వినతులు వచ్చాయ న్నారు. నిజం చెప్పాలంటే, ఎన్నికల గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని, అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నిలబడదామనుకున్నానని, అందుకే 2014లో పార్టీ ఆఫీస్‌ను అక్కడి నుంచి ప్రారంభిం చానని అన్నారు. మరోవైపు బీజేపీకి సీట్లు ఇచ్చే వ్యవహారంలో జనసేన చాలా త్యాగాలు చేసిందని వ్యాఖ్యానించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. పొత్తుల వ్యవహారంలో మధ్యవర్తిత్వం చేస్తే ఏమవు తుందో..తనకు ఇప్పుడు అర్థం అయ్యిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్షేమం కోసం నేను ఈ పని చేస్తు న్నాను అని స్పష్టం చేశారు. పెద్ద మనసుతో వెళ్తే చిన్నవాళ్లమయ్యామని చెప్పారు. సోదరుడు నాగబాబు టికెట్ కూడా త్యాగం చేయాల్సి వచ్చిందన్నారు. టికెట్ల రానివాళ్లు తనను వ్యక్తిగతంగా విమ ర్శిస్తే పర్వాలే దని.. కానీ, పొత్తుకు ఇబ్బంది కలిగేలా వ్యాఖ్యలు చేస్తే చర్యలు ఉంటాయని పవన్‌ కల్యాణ్ హెచ్చరిం చారు.

        ఇదిలా ఉంటే తాను విధానపరంగానే వైసీపీని విభేదిస్తాను తప్ప…జగన్ పై తనకు వ్యక్తిగత ద్వేషమేమీ లేదని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. వైసీపీ వారు తప్ప ఇంకెవరూ బతకకూడదు… మా గుంపే ఎదగాలి అంటే కుదరదు అని పవన్ చెప్పారు. జనసేనను తొక్కేస్తామంటే తాము కూడా వైసీపీని అథఃపాథాళానికి తొక్కేస్తాం అని హెచ్చరించారు. దెబ్బ పడే కొద్దీ మరింత ఎత్తుకు ఎదుగుతామని పవన్ చెప్పారు.మొత్తానికి రానున్న ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయం పై క్లారిటీ వచ్చేసింది. పిఠాపురం బరిలో పవన్ పోటీ చేయనున్నారు. ఈ నియో జకవర్గంలో కాపుల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో పిఠాపురం ప్రజల తీర్పు ఎలా ఉండబోతోందనేది ఆసక్తి గా మారింది.

Latest Articles

నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ

మేడ్చల్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్