పటాన్‌చెరు పోలీస్‌ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత

    సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్‌ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి అరెస్టు అనంతరం ఆయనను జిల్లా కోర్టుకు తరలించారు. పోలీస్ స్టేషన్‌ నుంచి బయటకు తీసుకెళ్తున్న సమయంలో బీఆర్ఎస్‌ నేతలు చేరుకుని నినాదాలు చేశారు. పోలీసు వాహనానికి అడ్డుపడి దాడికి యత్నించారు.

     సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ తెల్లవారుజామున పటాన్చెరులోని ఆయన నివాసానికి వచ్చిన పోలీసు లు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ కేసులో ఆయణ్ను అరెస్టు చేసినట్లు చెప్పారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

    సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం లగ్దారం గ్రామంలో మైనింగ్ చేసేందుకు మధుసూదన్ రెడ్డికి చెందిన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లయ్ కంపెనీ క్వారీనీ తవ్వుతోంది. కేంద్ర పర్యావరణ నిబంధ నలు ఉల్లగించి పరిమితికి మించి తవ్వకాలు జరపడం, అనుమతుల గడువు అయిపోయినా మైనింగ్ చేశారని ఇటీవల క్వారీని అధికారులు సీజ్ చేశారు. అనంతరం చర్యలు తీసుకోవాలని పటాన్‌చెరు పోలీసులకు తహశీల్దార్ ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈరోజు ఉదయం మధుసూదన్‌ను అరెస్ట్ చేశారు. ఆయనను అరెస్ట్ చేయడంతో పోలీస్ స్టేషన్కు భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు, మదుసూదన్ అనుచరులు చేరుకుని నినాదాలు చేశారు.

Latest Articles

నాని లైనప్ మారిందా..?

నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్