చంద్రబాబు అరెస్ట్ అయితే ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తుంది- మంత్రి రోజా

స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రూ.118 కోట్ల ముడుపుల కేసులో చంద్రబాబు అరెస్ట్ ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును సీబీఐ, ఈడీ విచారణ వేగవంతం చేయాలని కోరారు. ఈ కేసుల నేపథ్యంలో చంద్రబాబు విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్ట్ అయితే రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేయడంతో పాటు ఎన్టీఆర్ ఆత్మ కూడా సంతోషిస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బావమరిదిలా చంద్రబాబు మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటారా? రామోజీ రావులా మంచం ఎక్కుతారా? అచ్చన్నలా ఆసుపత్రిలో చేరతారా? విజయ్ మల్యాలా విదేశాలకు పారిపోతారా? ఇవన్నీ కాకుండా ఇప్పటిలాగే మరో స్టే తెచ్చుకుంటారా?’ అని ప్రశ్నిస్తూ సెటైర్లు వేశారు.

ముఖ్యంగా ప్రశ్నిస్తా అంటూ చెప్పే వపన్ కల్యాణ్ ఎక్కడ దాక్కున్నాడని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. బీజేపీ అంటే ఏపీలో బాబు జనతా పార్టీగా మారిందని.. పురంధేశ్వరి ఎందుకు మరిది గురించి మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కాగా, మరోవైపు దేశం పేరును ఇకపై భారత్‌గా పిలవబోతున్నారనే సంకేతాల నేపథ్యంలో.. ఇండియా పేరు మార్పులో తనకేం తప్పు కనిపించట్లేదని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఇంగ్లీష్‌లో ఇండియా అనడం కంటే.. తెలుగులో భారత్ అని అనడం చాలా బాగుందన్నారు.

Latest Articles

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు షాక్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. మంగళవారం తలపెట్టిన జనసేన సభకు అనుమతి నిరాకరించారు. రేపు రాష్ట్రంలో పార్టీ నవ నిర్మాణ సంకల్ప సభ ప్లాన్ చేసుకుంది...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్