భారీగా పడిపోయిన టమాట ధర.. కిలో 4 రూపాయలు మాత్రమే..!

స్వతంత్ర వెబ్ డెస్క్: టమాట.. నిన్న మొన్నటిదాకా ఈ పేరు వింటే సామాన్యులు బెంబేలెత్తిపోయేవారు. ఎందుకంటే ధరలు ఆ రేంజ్​లో ఉండేవి. ఏకంగా రూ.300 వరకు చేరింది కిలో టమాట ధర. ఇప్పుడు ప్రస్తుతం చాలా వరకు కిలో టమాట ధర రూ.10 వరకు గరిష్ఠంగా ఉంది. ఇక కొన్ని ప్రాంతాలలో కిలో నాలుగు రూపాయలకే టమోటాలు విక్రయిస్తున్నారు. కర్నూలు జిల్లా లో కిలో టమోటా 4 రూపాయలు పలుకుతోంది.

కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయం మార్కెట్లో దారుణంగా టమోటా ధరలు పడిపోయాయి. దీంతో కూలీ, రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కాదంటున్నారు టమాటో రైతులు. ఇక మార్కెట్ కు తెచ్చిన టమోటాలను అమ్మలేక, తిరిగి తీసుకెళ్లలేక కింద పడవేసి వెళ్తున్నారు రైతులు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్