పోలవరం ప్రాజెక్టు వ్యూను ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ప్రాజెక్టు క్యాంపు కార్యాలయం నుంచి ప్రాజెక్టు వ్యూను పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. కొత్తగా నిర్మిస్తున్న డయాఫ్రం వాల్ వద్ద యంత్రాల పనితీరును పరిశీలించారు. పనులపై ప్రాజెక్టు సీఈ నరసింహమూర్తి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు నిమ్మల.
షెడ్యూల్ ప్రకారమే పోలవరం పనులు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా నిమ్మల తెలిపారు. తుగ్లక్ పాలనతో పోలవరం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని చెప్పారు. డయాఫ్రమ్ వాల్‌ను వైసీపీ హయాంలో విధ్వంసం చేశారని అన్నారు. మాజీ సీఎం జగన్ కారణంగా వెయ్యి కోట్ల అదనపు భారం పడుతుందని అన్నారు. పోలవరం నిర్వాసితులను కూడా జగన్ మోసం చేశారని మంత్రి నిమ్మల ఆరోపించారు.