పీటర్ హెయిన్ మాస్టర్ పర్యవేక్షణలో కల్యాణ్ రామ్ ఫైటింగ్

నందమూరి కళ్యాణ్ రామ్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ #NKR21. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో, ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం టీమ్ హ్యుజ్ యాక్షన్ ఎపిసోడ్‌ను షూట్ చేస్తోంది, ఇది 15 రోజుల పాటు కొనసాగుతుంది.

150 మంది ఫైటర్లు, 300 మంది జూనియర్ ఆర్టిస్టులు షూట్‌లో పాల్గొంటున్న ఈ యాక్షన్ బ్లాక్‌ను ఇండియన్ టాప్ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ మాస్టర్ పర్యవేక్షిస్తున్నారు. ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలుస్తుంది. మేకర్స్ విడుదల చేసిన ఈ వర్కింగ్ స్టిల్‌లో పీటర్ హెయిన్ మాస్టర్ సజెషన్స్ ఇస్తూ కనిపించారు.

ఈ చిత్రంలో విజయశాంతి ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. రామ్ ప్రసాద్ డీవోపీ గా పని చేస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటర్.

నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ తదితరులు

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి
నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
డీవోపీ : రామ్ ప్రసాద్
బ్యానర్స్: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్
ఎడిటర్: తమ్మిరాజు
సమర్పణ: ముప్పా వెంకయ్య చౌదరి
స్క్రీన్ ప్లే: శ్రీకాంత్ విస్సా
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
యాక్షన్: రామకృష్ణ
పీఆర్వో : వంశీ-శేఖర్, వంశీ కాకా
మార్కెటింగ్: ఫస్ట్ షో

Latest Articles

కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..

మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్