సీఎం రేవంత్‌రెడ్డి ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించారు. ఇదే సమయంలో ట్రాన్స్‌జెండర్ల ఉపాధి కల్పనపై కూడా ఫోకస్ పెట్టారు. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్‌జెండర్లను వాలంటీర్లుగా నియమించాలని ఆదేశించారు. హోంగార్డుల తరహాలో ట్రాన్స్‌జెండర్లను నియమించాలని.. అర్హులైన వారిని ఎంపిక చేసి..10 రోజులపాటు ట్రాఫిక్ విధులపై శిక్షణ అందించాలన్నారు. వీరికి ప్రత్యేక యూనిఫాంతోపాటు ప్రతి నెలా కొంత స్టైఫండ్ ఇవ్వాలని ఆదేశించారు సీఎం రేవంత్. సీఎం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ట్రాన్స్‌జెండర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.