38.2 C
Hyderabad
Saturday, May 2, 2026
spot_img

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ నిర్వహించిన సర్వేలో ఇదే విషయం తేటతెల్లమైంది. ట్రంప్ తీసుకొస్తున్న‌ పాలసీలు, ఆయన ప్రవర్తిస్తున్న తీరు, ఇచ్చిన వాగ్ధానాలు నిలబెట్టుకోవడం వంటి విషయాలపై ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే నిర్వహించింది. 2026 మే నెలలో విడుదలైన ఈ నివేదిక ప్రకారం.. ట్రంప్ తన రెండో దఫా పాలనలో ప్రజాదరణను క్రమంగా కోల్పోతున్నారని పేర్కొంది.

ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌ తాజా అధ్యయనం ప్రకారం.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పనితీరును ఆమోదించే అమెరికన్లు ప్రస్తుతం 34 శాతంగా ఉంది. ఆయన రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే అత్యల్పం. అక్కడి ప్రజలు ఆయన తీసుకొస్తున్న విధానాలను మాత్రమే విమర్శించడం లేదు.. ఒక వ్యక్తిగా ప్రజలు ఆయనను చూసే కోణాన్ని కూడా మార్చుకుంటున్నారు.

ఏప్రిల్ 20 నుండి 26 వరకు సర్వే నిర్వహించగా.. అందులో 5,103 మంది అమెరికన్ పౌరులు పాల్గొన్నారు.దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యల విషయంలో ట్రంప్‌పై ప్రజల నమ్మకం తగ్గిందని ఈ సర్వేలో తేలింది.

ట్రంప్‌ ఇచ్చిన హామీలను నెలబెట్టుకుంటున్నారు.. అని చెప్పే అమెరికన్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 2024 నవంబర్‌లో 51శాతం మంది ట్రంప్‌ను నమ్మగా..గత ఆగస్టులో 43 శాతం.. ప్రస్తుతం అది 38శాతంగా ఉంది.

చాలా తక్కువ మంది అమెరికన్లు మాత్రమే ట్రంప్‌ని మానసికంగా చురుకైన వ్యక్తిగా చూస్తున్నారు. ఇది 2024 నవంబర్‌లో 55 శాతం నుండి గతేడాది ఆగస్టులో 48 శాతానికి, ఇప్పుడు 44 శాతానికి పడిపోయింది.

ఇమ్మిగ్రేషన్‌ పాలసీపై ట్రంప్ మంచి నిర్ణయాలు తీసుకోగలరని ప్రస్తుతం 41 శాతం మంది అమెరికన్లు నమ్మకంగా ఉన్నారు. ఇదే సంఖ్య గత ఏడాది ఆగస్టులో 46 శాతం ఉండగా.. 2024లో 53 శాతంగా ఉండేది. అదే సమయంలో సైనిక శక్తిని తెలివిగా ఉపయోగించుకోవడంలో ట్రంప్‌ సామర్థ్యంపై గత ఏడాది సమ్మర్‌లో 46 శాతంగా ఉన్న ప్రజల నమ్మకం ప్రస్తుతం 38 శాతానికి పడిపోయింది.

ఎకనామిక్‌ పాలసీ విషయంలో ట్రంప్‌ మంచి నిర్ణయాలు తీసుకుంటారనే ప్రజల విశ్వాసంలో పెద్దగా మార్పులేదు. ఆర్థిక విధానంపై గత ఆగస్టులో 44 శాతంగా ఉన్న నమ్మకం.. ప్రస్తుతం 42 శాతంగా ఉంది.

రిపబ్లికన్లు, రిపబ్లికన్లకు మద్దతు తెలిపే స్వతంత్రులలో కూడా పలు విషయాల్లో ట్రంప్‌ విశ్వాసం కోల్పోయారని సర్వేలో తేలింది.

అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు నిర్వహిస్తున్న తీరును జనవరిలో 73 శాతం మంది ఆమోదించగా.. ప్రస్తుతం అది 68 శాతానికి పడిపోయింది. ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని 70 శాతం మంది భావిస్తున్నారు. అయితే ఇది గత ఏడాది కన్నా 6 శాతం తక్కువ.. నవంబర్‌ 2024 నుంచి 14 శాతం తక్కువగా ఉంది.

మిలిటరీకి సంబంధించిన నిర్ణయాలను తీసుకోవడంలో కూడా ట్రంప్‌ సామర్థ్యంపై రిపబ్లికన్లలో నమ్మకం తగ్గిందని తేలింది.

ఇక డెమెక్రాట్లు, వారికి మద్దతు తెలిపే వారి విషయానికి వస్తే.. ట్రంప్‌ను వారు దాదాపుగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ట్రంప్‌ పదవీకాలం తొలి రోజులతో పోలిస్తే ఈ విషయంలో పెద్దగా మార్పు లేదు. ఇవాళ కేవలం 5 శాతం మంది మాత్రమే ఆయన పనితీరును ఆమోదిస్తున్నారని ప్యూ అధ్యయనంలో తేలింది.

Latest Articles

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్