35.2 C
Hyderabad
Monday, May 4, 2026
spot_img

తమిళనాట విజయ్ ప్రభంజనం.. పశ్చిమ బెంగాల్ లో మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ ఆధిక్యం

ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ప్రజల తీర్పు వెలువడుతోంది. పశ్చిమ బెంగాల్‌, కేరళం, అస్సాం, తమిళనాడు , పుదుచ్చేరీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ తమిళనాడులో నటుడు విజయ్‌ నేతృత్వంలోని టీవీకే పార్టీ హవా కొనసాగిస్తోంది. డీఎంకే, అన్నాడీఎంకేను దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో భారీ అధిక్యంతో 168 స్థానాల్లో బీజేపీ దూసుకెళ్తుంటే.. కేరళలో యూడీఎఫ్‌ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు, కాంగ్రెస్‌ పార్టీ ఏ రాష్ట్రంలోనూ ప్రభావం చూపించకలేకపోతోంది.

తమిళనాడులో మొత్తం 234 స్థానాలు ఉండగా.. టీవీకే 106 చోట్ల ఆధిక్యంలో ఉంది. డీఎంకే 48, అన్నాడీఎంకే 77 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో 293 స్థానాలకు గానూ.. బీజేపీ 178 చోట్ల ఆధిక్యంలో ఉంది. టీఎంసీ 113 చోట్ల ముందంజలో కొనసాగుతోంది. కాంగ్రెస్‌ కేవలం స్థానాలకు పరిమితమైంది. కేరళంలో 140 స్థానాలుండగా.. యూడీఎఫ్‌ 95 చోట్ల ముందంజలో ఉంది. ఎల్‌డీఎఫ్‌ 44 స్థానాల్లో, ఎన్డీయే ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. అసోంలో 126 స్థానాలుండగా.. బీజేపీ 98 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్‌ 25 చోట్ల ముందంజలో ఉంది. పుదుచ్చేరిలో 30 స్థానాలకుగానూ ఎన్నార్‌ కాంగ్రెస్‌+ 20 చోట్ల ఆధిక్యంలో ఉంది

Latest Articles

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి షాక్‌… దూసుకెళ్తోన్న బీజేపీ

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చరిత్ర సృష్టిస్తోంది. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కు గట్టి షాకిస్తూ భారతీయ జనతా పార్టీ దూసుకెళ్తోంది. మొత్తం 293 స్థానాలకు గానూ .. ప్రస్తుతం బీజేపీ 186 స్థానాల్లో ముందంజలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్