జమ్మూకశ్మీర్‌లోని కిష్టవార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారంతో చాట్రూ ప్రాంతంలో ఆపరేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనికులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు చెప్పారు.
కశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడం శాంతిభద్రతల సమస్యగా మారింది. సెప్టెంబర్ 18వ తేదీన దోడా, కిష్టవార్, రాంబన్, అనంతనాగ్, పుల్వామా, సోఫియాన్, కుల్గామ్ జిల్లాల్లో పోలింగ్ జరగనుంది.