MLC Kavitha |ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత నేడు సీబీఐ ఎదుట హాజరైంది. పిడికిలి బిగిస్తూ.. పట్టుదలతో సిబిఐ కార్యాలయంలో కవిత అడుగుపెట్టింది. విచారణలో భాగంగా ఢిల్లీ చేరుకున్న కవితను జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని ఐదుగురు అధికారుల టీమ్ ప్రశ్నిస్తోంది.
అంతకముందు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరైన కవిత(MLC Kavitha) ఢిల్లీలోని కేసీఆర్ నివాసం నుంచి సరిగ్గా 11 గంటలకు బయలుదేరి అక్కడి నుంచి సరిగ్గా 1 కిలో మీటరు దూరంలోని ఈడీ ఆఫీసుకు 11. 08 గంటలకు చేరుకున్నారు. ED ఆఫీసులోకి ఒంటరిగా వెళ్లిన కవిత అక్కడ కూడా పిడికిలి బిగించి అభివాదం చేశారు. పిడికిలిలో పట్టుదల కనిపించినా ఆమె ముఖంలో ఒకింత దిగులు కనిపించింది. అభిమానులు, అయితే కారులో కూర్చున్నంత సేవు కూడా ఆమె పిడికిలి బిగించి కనిపించడం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందాన్ని నింపుతోంది.
Read Also: హిందూ ఆలయాల దాడులపై ప్రధాని మోడీ ఆందోళన
Follow us on: Youtube Instagram