జనవరి 1న ‘క్రావెన్: ది హంటర్’

మైండ్ బ్లోయింగ్ యాక్షన్ డ్రామా, క్రావెన్: ది హంటర్ ఇంకో రెండు వారాల్లో థియేటర్లలో విడుదల కానుంది. సోనీ సంస్థ నుంచి రానున్న సూపర్ హీరో సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ సినిమా కి ఆర్ రేటింగ్ వచ్చిన నేపథ్యం లో డైరెక్టర్ చందూర్ మీడియా తో మాట్లాడారు.

“ఈ చిత్రానికి ఆర్ రేటింగ్ రావడం ఒక వరం గా భావిస్తున్నాను. దీని ద్వారా కథ కి నేను నాయయం చేయగలను అని అనిపిస్తుంది. క్రావెన్ కథ ని అత్యద్భుతంగా చెప్పడం అవసరం. అందుకే ఈ సినిమా కి ఆర్ రేటింగ్ రావడం శుభ పరిణామం అని నేను భావిస్తున్నాను.” అని అన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ, “కోపం, ఆవేశంతో సెర్గీ ఇద్దరు పిల్లలని టీనేజ్ లో చంపేస్తాడు. ఆ తర్వాత అతను ఈజీగా ఎస్కెప్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ అతనలా చేయకుండా ఉన్నాడు. అందుకు కూడా ఒక జస్టిఫికేషన్ ఉంది: చనిపోయిన ఇద్దరూ చెడ్డ వ్యక్తులు అని అతను భావించడం తో, ఆపుకోలేనటువంటి కోపావేశం తో అతను ఈ భూమి మీద నుంచి ఇద్దరిని చంపేశా అని భావించాడు. ఆ కోపమే ఈ కథ కి ఆయువుపట్టు.” అని చెప్పారు.

క్రావెన్: ది హంటర్ సినిమా యాక్షన్ ఎలిమెంట్స్ తో అలరిస్తుంది. మార్వెల్ కి సంబందించిన ఒక ఐకానిక్ విలన్ కథని ఇందులో చూడొచ్చు. చాందర్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా లో అరియానా డీ బోస్, ఫ్రెడ్ హెచ్చింగర్, అలెసాండ్రో నీవోలా, క్రిస్టోఫర్ అబ్బాట్ మరియు రస్సెల్ క్రౌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జనవరి 1 న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

Latest Articles

చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్‌ఫాల్స్‌

పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్