మోదీ ప్రభుత్వం ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 2020లో మోదీ NEP-2020 నూతన జాతీయ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానం ద్వారా విద్యార్థులు కనీసం రెండు ప్రాంతీయ భాషలను నేర్చుకునేలా ప్రోత్సాహం ఇచ్చారని కిషన్ రెడ్డి చెప్పారు. భాషల ప్రాముఖ్యతను తీసుకుని, మోదీ ప్రభుత్వం దేశంలో ప్రాంతీయ భాషలను మరింత ప్రోత్సహించడానికి కృషి చేస్తోందని ఆయన అన్నారు. మన రాజ్యాంగంలో 14 అధికార భాషలు ఉండేవని… కానీ.. మోదీ ప్రభుత్వం వచ్చాక 21 భాషలకు అధికారిక స్థానం దక్కిందని కిషన్ రెడ్డి చెప్పారు.