అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం అటు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. హైదరాబాద్ పోలీసులు సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలపై దృష్టి సారించారు. అల్లు అర్జున్ ను కావాలనే అరెస్టు చేశారని.. కొంతమంది తెలంగాణ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అల్లు అర్జున్ అరెస్ట్ తరువాత సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టుల పెట్టిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి పై అభ్యంతరకరంగా అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.