జనసేన నేత రేవ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయడం సంచలనం రేపుతోంది. సోషల్ మీడియాలో జనసేన నేత నిర్వాకం వైరల్ అవుతోంది. దీంతో, పోలీసులు కేసు నమోదు చేసారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పార్టీకి డామేజ్ చేసినట్లుగా గుర్తించిన జనసేన నాయకత్వం ఏలూరు జిల్లా నిడమర్రు మండల పార్టీ అధ్యక్షుడు వాకమూడి ఇంద్రపైన వేటు వేసింది.
జనసేన నేత వాకమూడి ఇంద్ర ఏలూరు జిల్లా నిడమర్రు మండలం క్రొవ్విడి గ్రామం బావాయి పాలెంలో రేవ్ పార్టీ ఇచ్చారు. పుట్టినరోజు సందర్భంగా ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఇందులో కొందరు యువతులతో అశ్లీల నృత్యాలు చేయటం వివాదంగా మారింది. వారితో కలిసి జనసేన నేతలు డాన్స్‌లు చేశారు. ఈ పార్టీ కోసం భారీగా ఖర్చు చేసారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సొంత పార్టీ నేతలే ఈ వీడియోలు వైరల్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో, ఈ వ్యవహారం పైన పోలీసులు కేసు నమోదు చేసారు. ఇప్పుడు ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారటంతో జనసేన నాయకత్వం ఇంద్రుకుమార్‌ను పార్టీ నుంచి తప్పించింది.
బావాయిపాలెం రైస్‌మిల్లులో జన్మదిన వేడుకల పేరుతో రేవ్ పార్టీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. అందులో భాగంగా మండల స్థాయి నాయకులతో కేక్ కటింగ్ చేసి వివిధ రకాల నాన్‌వెజ్ వంటకాలతో భారీగా భోజనాలు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి సమయంలో కొందరు యువతులను పిలిపించి అసభ్యకరంగా నృత్యాలు చేయిచడం కలకలం రేపింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై సుమోటోగా స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. దీంతో, ఇంద్రకుమార్‌ను జనసేన గ్రామ పార్టీ పదవి నుంచి, పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది.