ఆ నలుగురు ఏం చేస్తున్నారు..? ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటి..?

మెగాస్టార్ చిరంజీవి, నట సింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఈ నలుగురు సీనియర్ హీరోలు నాటి నుంచి నేటి వరుకు విభిన్న కథా చిత్రాల్లో.. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూనే ఉన్నారు.. ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. స్టార్ హీరోలు, యంగ్ హీరోలు ఒకేసారి ఒక సినిమా చేయడానికే కష్టపడుతుంటే.. ఈ సీనియర్ హీరోలు ఒకేసారి రెండు సినిమాలు పట్టాలెక్కించేస్తున్నారు. అంతే కాదండోయ్ ఫిట్ నెస్ లో కూడా షాక్ ఇస్తున్నారు. ఇంతకీ.. ఈ నలుగురు సీనియర్స్ ఇప్పుడు ఏ ఏ సినిమాలు చేస్తున్నారు. ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటి..?

మెగాస్టార్ చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు మూవీతో బ్లాక్ బస్టర్ సాధించి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. విశ్వంభర మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. మరో వైపు డైరెక్టర్ బాబీతో సినిమా చేసేందుకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇలా మెగాస్టార్ చిరంజీవి స్పీడు పెంచి వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇక ఫిట్ నెస్ విషయానికి వస్తే.. ఏకంగా 14 కేజీల బరువు తగ్గారు. దీంతో బాస్ మ‌రింత స్మార్ట్ లుక్ లోకి వ‌చ్చేసారు. 70 ఏళ్ల వయసులో చిరు చూపిస్తున్న అంకితభావం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. లేటెస్ట్ గా చిరు రిలీజ్ చేసిన ఫోటోల్లో మరింత యంగ్ గా కనిపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

బాలయ్య స్పీడు మామూలుగా లేదు. అఖండ సినిమా నుంచి అఖండ 2 వరుకు వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధిస్తూ దూసుకెళుతున్నారు. ప్రస్తుతం మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో మూవీ చేస్తున్నారు. త్వరలో కొరటాల శివ డైరెక్షన్ లో ఓ భారీ చిత్రం చేయడానికి ఓకే చెప్పారు. ఇటీవల బాలయ్య న్యూ లుక్ బయటకు వచ్చింది. ఫిట్ గా బాలయ్య లుక్ అదిరింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇక కింగ్ నాగార్జున ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ ఫిట్ గా ఉండేందుకు డైట్ పాటిస్తారు. అందుకనే.. ఆయన అంత అందంగా ఉంటారు. సినిమాల విషయానికి వస్తే.. కెరీర్లో 100వ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ కాకుండానే.. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు కింగ్ నాగార్జున.

విక్టరీ వెంకటేష్.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించి ఫామ్లోకి వచ్చారు. లేటెస్ట్ గా మన శంకర్ వరప్రసాద్ గారు మూవీలో చిరుతో కలిసి నటించి ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేశారు. ఇప్పుడు ఆదర్శ కుటుంబం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సాధించేందుకు రెడీ అవుతున్నారు. దీని తర్వాత మళ్లీ అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో మ‌రింత స్లిమ్ గా క‌నిపించ‌నున్నార‌ని వార్త‌లొస్తున్నాయి. ఇలా.. సీనియర్ హీరోలు ఫిట్ నెస్ లోనూ.. స్పీడుగా సినిమాలు చేయడంలోనూ దూసుకెళుతుండడం విశేషం.

Latest Articles

పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్