ఈ ఇయర్ లో వచ్చే క్రేజీ సినిమాలు ఏంటి..?

ఈ ఇయర్ ఫస్టాఫ్ లో భారీ, క్రేజీ సినిమాలు వస్తాయని ఎదురు చూసిన సినీ అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇంకా చెప్పాలంటే.. ఈ సమ్మర్ ని ఇండస్ట్రీ వేస్ట్ చేసుకుంది. దీంతో సెకండాఫ్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి..? ఏ ఏ హీరోలు సినిమాలు రెడీ అవుతున్నాయి..? కనీసం రానున్న ఆరు నెలల్లో అయినా.. క్రేజీ సినిమాలు థియేటర్స్ లో వస్తాయా..? ఈ సినిమాలు అయినా.. ఆడియన్స్ ని మెప్పిస్తాయా..? అనే డౌట్ స్టార్ట్ అయ్యింది మూవీ లవర్స్ కి. మరి.. ఈ ఇయర్ లో రానున్న క్రేజీ సినిమాలు ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా.. అయితే.. ఈ స్టోరీ చూడాల్సిందే.

ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రానున్న క్రేజీ సినిమా అంటే పెద్ది. ఈ మూవీ జూన్ 4న థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. అఖిల్ లెనిన్ మూవీ జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిఖిల్ పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ అంటూ చేసిన స్వయంభు మూవీ త్వరలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ ఇయర్ లో రానున్న మరో క్రేజీ మూవీ విశ్వంభర. మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర ఎప్పుడో రావాలి కానీ.. ఇంత వరుకు విడుదల కాలేదు. ఇప్పుడు జులై 10న లేదా ఆగష్టులో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆగష్టు 21న నాని ప్యార డైజ్ మూవీ విడుదల కానుంది. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రూపొందుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే భారీ, క్రేజీ మూవీ టాక్సిక్ మార్చి నుంచి పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఈ మూవీ కూడా ఆగష్టులో విడుదల అయ్యే ఛాన్స్ ఉందని టాక్.

ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్ 2 మూవీ సెప్టెంబర్ 4న రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 11న విజయ్ దేవరకొండ రణబాలి మూవీ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నాగచైతన్య వృషకర్మ సెప్టెంబర్ లేదా దసరాకి రిలీజ్ కానుందని టాక్. నాగ్ 100వ సినిమా ఎప్పుడు రిలీజ్ అనేది ప్రకటించలేదు కానీ.. దసరాకి విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది. అలాగే వెంకీ ఆదర్శ కుటుంబం, బాలయ్య, మలినేని కాంబో మూవీ కూడా దసరాకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫౌజీ మూవీ ఆగష్టులో రిలీజ్ కావాలి. అయితే.. అనుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ జరగకపోవడం వలన అక్టోబర్ లో విడుదల అని ప్రచారం జరిగింది కానీ.. డిసెంబర్ లో థియేటర్లోకి వస్తుంది అనేది ఇన్ సైడ్ న్యూస్. అలాగే డిసెంబర్ లో విజయ్ దేవరకొండ రౌడీ జనార్థన కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇలా భారీ, క్రేజీ సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఫస్టాఫ్ లో వచ్చిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.. మరి.. ఈ ఇయర్ సెకండాఫ్ లో వచ్చే ఈ క్రేజీ సినిమాల్లో ఏ సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకుని సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో చూడాలి.

Latest Articles

ధనుష్‌.. ప్లాన్ అదిరింది..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్