ప్రతి పౌరుడి సమానత్వం కోసం రాహుల్ గాంధీ పోరాడుతుంటే, బీజేపీ కుల, మత, ధనిక అంతరాలను సూచించే మను ధర్మ శాస్త్రాన్ని అనుసరిస్తోందని మంత్రి సీతక్క హైదరాబాద్ లో విమర్శించారు. అంబేద్కర్ పేరు తలచడాన్ని అమిత్ షా తప్పుపట్టడం అంటే.. అంబేద్కర్ ను అవమానించడమే అని ఆమె అన్నారు. దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని అన్నారు. ఒకే ఎన్నిక ,ఒకే పార్టీ ,ఒకే వ్యక్తి అనే కుట్ర కు బీజేపీ తెరలేపుతోందని మంత్రి సీతక్క మండిపడ్డారు.