హైకోర్టులో నటుడు మోహన్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. జర్నలిస్టుపై దాడి కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు తరపు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేశాకే తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.