32.2 C
Hyderabad
Saturday, May 16, 2026
spot_img

ట్రంప్‌తో కలిసి చైనా పర్యటన… మస్క్ వింత ఎక్స్ ప్రెషన్స్ వీడియో వైరల్

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చైనాలో జరిగిన ఓ హై-ప్రొఫైల్ విందులో అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే అది వ్యాపార చర్చలకు సంబంధించి కాదు.. ఆయన చేసిన ముఖ హావభావాల వల్ల సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆధ్వర్యంలో గురువారం, మే 14న విందులో ఎలాన్ మస్క్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.

విందు సమయంలో మస్క్ వివిధ రకాల ముఖ హావభావాలు చేస్తూ కనిపించారు. ఈ వీడియోను ఆయన స్వయంగా తన ఎక్స్ (X) ఖాతాలో షేర్ చేయడంతో అది వేగంగా వైరల్ అయింది.

ఈ కార్యక్రమానికి సంబంధించి మస్క్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి చైనా వెళ్లిన ప్రతినిధి బృందంలో ఉన్నారు.. ఇందులో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, టిమ్ కుక్ కూడా ఉన్నారు.

ఈ పర్యటనలో మస్క్ ఎందుకు ఉన్నారో కచ్చితంగా తెలియదు కానీ… మస్క్ గతంలో కూడా చైనాలో పర్యటించారు. 2023లో ఆయన టెస్లా షాంఘై గిగాఫ్యాక్టరీని సందర్శించి చైనా టెక్నాలజీ వృద్ధిని ప్రశంసించారు. చైనా టెస్లాకు కీలక మార్కెట్‌గా ఉన్న విషయం తెలిసిందే.

ఈ పర్యటనలో చైనా అమెరికా కంపెనీలతో సహకారానికి తలుపులు మరింత తెరవబడతాయని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తెలిపారు. అమెరికా-చైనా సంబంధాలపై చర్చలు జరుగుతున్న వేళ ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

ట్రంప్ ఈ సమావేశంలో షీ జిన్‌పింగ్‌తో కీలక వాణిజ్య ఒప్పందాలు కుదిరినట్లు తెలిపారు. వ్యవసాయం, విమానయానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో ఒప్పందాలపై చర్చలు జరిగాయి.

 

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్