38.2 C
Hyderabad
Friday, May 15, 2026
spot_img

ఆ.. నలుగురు బాటలో.. ఇస్మార్ట్ రామ్..

ఎనర్జిటిక్ హీరో అంటే.. ఠక్కున గుర్తొచ్చేది రామ్. ఇంకా చెప్పాలంటే.. మన పక్కంటి కుర్రాడులా.. చాక్లెట్ బాయ్ లా.. క్లాస్ గా ఉండే రామ్.. మాస్ గా మెప్పించాలని తపించాడు. ఇస్మార్ట్ శంకర్ మూవీతో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. అయితే.. ఆతర్వాత చేసిన మాస్ ప్రయత్నాలు ఫలించలేదు. రూటు మార్చి ఆంధ్రా కింగ్ తాలూకా అంటూ ఫీల్ గుడ్ మూవీగా క్లాస్ మూవీ చేస్తే.. అది కూడా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. అయితే.. ఈ మూవీతో ఓ ప్రయోగం చేయబోతున్నాడు రామ్. దీంతో నలుగురు సీనియర్ హీరోల తర్వాత అలా చేస్తున్న హీరోగా క్రెడిట్ ని రామ్ దక్కించుకున్నాడు. ఇంతకీ.. ఆ ముగ్గురు హీరోలు ఎవరు..? రామ్ చేయబోతుంది ఏంటి..?

వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలో రూపొందిన దేవదాసు సినిమాతో తెలుగు తెరకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్. ఈ మూవీ ఫస్ట్ మూవీ అయినప్పటికీ.. అలా అనిపించదు. పాత్రకు తగ్గట్టుగా నటించి మెప్పించాడు.. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ డైరెక్షన్ లో జగడం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే.. ఆ సినిమా ప్లాప్ అయ్యింది కానీ.. నటుడుగా రామ్ మాత్రం ఫ్లాప్ అవ్వలేదు. ఆ టైమ్ కి.. ఆ కథ అతనికి సెట్ కాలేదు అంతే..

ఆతర్వాత రెడీ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. మాస్కా, రామ రామ కృష్ణ కృష్ణ, ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త, మసాలా, పండగ చేస్కో.. తదితర చిత్రాల్లో నటించినా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. హైపర్, హలో గురు ప్రేమ కోసమే సినిమాలు ఆశించినంత హిట్ సాధించలేకపోయాయి. కానీ రామ్ తన నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. మాస్ ని మెప్పించాలని ఎప్పటి నుంచో తపిస్తున్న రామ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేసిన ఇస్మార్ట్ శంకర్ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. రామ్ కి మాస్ లో మంచి క్రేజ్ తీసుకువచ్చింది.

ఇస్మార్ట్ శంకర్ మాస్ హిట్ అవ్వడంతో.. రెడ్, వారియర్, స్కంధ, డబుల్ ఇస్మార్ట్ అంటూ మాస్ మూవీస్ చేశాడు రామ్. అయితే.. ఈ సినిమాల్లో ఒకటి కూడా ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. దీంతో ఆంధ్రా కింగ్ తాలూకా అంటూ క్లాస్ మూవీ చేసాడు. అయితే.. ఇది కూడా రామ్ కు సక్సెస్ అందివ్వలేకపోయింది. ఇప్పుడు పుట్టినరోజు సందర్భంగా రామ్ కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ డిఫరెంట్ గా ఉంది.. ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు విషయం ఏంటంటే.. ఈ మూవీని రామే డైరెక్ట్ చేయబోతున్నారు. సీనియర్ హీరోలు ఎన్టీఆర్, కృష్ణ, పవన్ కళ్యాణ్, విశ్వక్ సేన్.. ఈ నలుగురు తర్వాత డైరెక్షన్ చేస్తున్న హీరో రామే. ఎన్టీఆర్, కృష్ణ, పవన్ కళ్యాణ్‌, విశ్వక్ సేన్.. హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా తమ మార్క్ చూపించారు. అయితే.. ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన ఈ టైమ్ లో రామ్ డైరెక్షన్ చేయడం అంటే కాస్త రిస్కే. మరి.. ఈ రిస్కీ ప్రయత్నంలో రామ్ ఎంత వరుకు సక్సెస్ అవుతాడో.. ఎలాంటి సినిమాని అందిస్తాడో చూడాలి.

Latest Articles

చల్లని కబురు.. ఈసారి ముందుగానే కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) ఊరటనిచ్చే వార్త చెప్పింది. దేశానికి అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాలు ఈసారి సాధారణం కంటే ముందుగానే కేరళ తీరాన్ని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్