జార్జియాలో విషాదం చోటుచేసుకుంది. కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ పీల్చడంతో 12 మంది భారతీయులు మృతి చెందారు. భారతీయ రెస్టారెంట్ గుడౌరి మౌంటెయిన్ రిసార్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ పీల్చడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రాథమిక విచారణలో వారి బెడ్ రూమ్ సమీపంలో ఉన్న పవర్ జనరేటర్ నుంచి విడుదలైన వాయువు మూసి ఉన్న గదిలో కార్బన్ మోనాక్సైడ్‌గా మారినట్లు గుర్తించారు. అయితే ఖచ్చితమైన సమాచారం కోసం ఫోరెన్సిక్ విచారణ చేపట్టినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అయితే చనిపోయిన వారిలో 11 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపారు.. దర్యాప్తులో మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని పేర్కొంది.